పార్టీలోకి ఆహ్వానించిన డిప్యూటీ సీఎం భట్టి
ఖమ్మం, డిసెంబర్ 25 (విజయక్రాంతి): మధిర నియోజకవర్గ కేంద్రంలో బుధవారం బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ చేరికలు జరిగాయి. కాంగ్రెస్ నాయకుడు కరివేద సుధాకర్ నేతృత్వంలో బీఆర్‌ఎస్‌కు చెందిన పీఆర్టీయూ నాయకులు బోయపాటి వెంకటేశ్వరరావు, దురశాల జగన్నాధ చారి, జేవీరెడ్డి, ఎల్వీరెడ్డి, వినోద్ భట్టి కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు మిర్యాల రమణగుప్తా, అనిల్ కుమార్ నెహ్రూ, పారుపల్లి విజయకుమార్, శీలం వెంకటరెడ్డి, సందీప్, రంగా శ్రీనివాసరావు, తన్నీరు రామకృష్ణ, మాగం ప్రసాద్ పాల్గొన్నారు.