calender_icon.png 9 February, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరికలు

09-02-2025 12:00:00 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపుతో శనివారం పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో రాయపర్తి మండలం జెతురంతండా పంచాయతీ పరిధిలోని రావుల తండాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు భూక్య యకూబ్, లకావత్ రవి, నేతవత్ సందీప్, వీర్, శ్రీను, సీమ, రవి, చందర్, మొగిలి, మోహన్ బీఆర్‌ఎస్‌లో చేరారు.

కార్యక్రమంలో రాయపర్తి మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్‌గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల అధికార ప్రతినిధి తాళ్లపెల్లి సంతోష్‌గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఎలమంచ శ్రీనివాస్‌రెడ్డి, మండల నాయకులు లేతాకుల రంగారెడ్డి, లేతాకుల మధుకర్‌రెడ్డి, బిల్లా వెంకట్‌రెడ్డి, లేతాకుల సుధాకర్‌రెడ్డి, నేతవత్ కిషన్, గుగులోత్ రవి, శ్రీధర్, నాయకులు మన్సుర్, సంతోష్, రవి, సుమన్, రమేష్, వీర్, రవి పాల్గొన్నారు.