calender_icon.png 2 April, 2025 | 2:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీ ఈటల సమక్షంలో బీజేపీలో చేరిక

01-04-2025 02:20:49 AM

మేడ్చల్, మార్చి 31 (విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఏళ్ల తిరుపతిరెడ్డి, ఆయన కుమారుడు సెయింట్ మేరీస్ సెంట్రల్ స్కూల్ డైరెక్టర్ ఏళ్ల వరప్రసాద్ రెడ్డి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ సమక్షంలో బిజెపిలో చేరారు. వీరికి బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దేశభద్రతకు బిజెపి ప్రభుత్వమే శ్రీరామరక్ష అని, సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నామని వారు తెలిపారు. ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో పార్టీ కోసం పనిచేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు  విక్రం రెడ్డి, షామీర్పేట్ మండల అధ్యక్షుడు కొరివి కృష్ణ, నాయకులు భావనసు శ్రీనివాస్, మైసయ్య, ఆల రాజిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఉదయ్ కుమార్, అశోక్, శ్రీధర్, పవన్ గౌడ్ బోయిని శివ, అర్జున్, సామల పవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.