calender_icon.png 7 November, 2024 | 9:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరా

03-07-2024 03:27:09 AM

  • కేటీఆర్ అసత్య ఆరోపణలు మానుకో 
  • జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్

జగిత్యాల, జూలై 2 (విజయక్రాంతి): అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని, సలాభం కోసం కాదని జగిత్యాల ఎమ్మెల్యే మాకునూరి సంజయ్‌కుమార్ తెలిపారు. తనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. మంగళవారం జగిత్యాల క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సలాభం కోసం తాను అధికార పార్టీలో చేరానని కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను నియోజకవర్గ ప్రజలు విశసించవద్దని విజ్ఞప్తి చేశారు.

జగిత్యాల ప్రాంత అభివృద్ధి కోసం, సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం మేరకు కాంగ్రెస్‌లో చేరానని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతు పక్షపాతని, ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతారనే నమ్మకం ఉన్నదన్నారు. ఎక్కడా లేని విధంగా 4,500 డడుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనలో కొంత ఆలస్యమైందన్నారు. సీఎం సహకారంతో రూ.32.16కోట్ల నిధుల మంజూరి కోసం జీవో తీసుకొచ్చానన్నారు. మాజీ ఎంపీ కలకుంట్ల కవిత సహకారంతో రాజకీయాలకు వచ్చాచనని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లోకి ఆహానించలేదా ఎమ్మెల్యే ప్రశ్నించారు.