calender_icon.png 16 March, 2025 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపదలో అండగా జాన్సన్ నాయక్..

05-03-2025 06:36:59 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): తన ఇన్చార్జి, నాయకత్వ నియోజకవర్గం, ఖానాపూర్ లో ఆరుగురు వ్యక్తులు అకారణంగా మలేషియా దేశ పోలీసులకు చిక్కి, జైలులో శిక్ష అనుభవిస్తున్న, వ్యక్తులను విడిపించేందుకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం, బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ తీవ్ర కృషి చేస్తున్నారు. గత మూడు రోజులుగా, మలేషియా దేశంలో ముఖం వేసి, అక్కడి పోలీస్ ఉన్నతాధికాలతో మాట్లాడి, బాధితులను కలిసి, వారి కొరకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

కొంతకాలం క్రితం నియోజకవర్గం కడెం మండలం, లింగాపూర్, దస్థురా బాద్, మున్యాల్, గ్రామవాసులు రాచకొండ నరేష్, తలారి భాస్కర్, గురజాల శంకర్, గురిజాల రాజేశ్వర్, గుండా శ్రీనివాస్, యమునూరి రవీందర్, అనే వ్యక్తులు మలేషియా దేశానికి వచ్చి అక్రమ కేసుల్లో ఇరికి జైల్లో మగ్గుతున్నారని సమాచారం తెలుసుకున్న జాన్సన్ నాయక్, ఆ దేశంలో మూడు రోజులుగా మకాం వేశారు. ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహాయంతో వారిని విడిపించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నానని ఆయన తెలిపారు. జాన్సన్ నాయక్ సొంత నిధులతో అక్కడి న్యాయవాదులను నియమించి, బాధితులను జైలు నుంచి విడుదల అయ్యేవరకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.