calender_icon.png 13 October, 2024 | 5:50 AM

జానీ మాస్టర్ బెయిల్ తీర్పు వాయిదా

10-10-2024 12:00:00 AM

14న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం 

రాజేంద్రనగర్, అక్టోబర్ 9: లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయి ల్ తీర్పు వాయిదా పడింది. ఇటీవల తనకు అవార్డు వచ్చిందని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన అభ్య ర్థించడంతో కోర్టు ఈ నెల 6 నుంచి 10 వరకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, అవార్డు కమిటీ జానీ మాస్టర్‌పై ఆరోపణలు రావడంతో దానిని తాత్కాలికంగా రద్దు చేసింది.

దీంతో ఆయన కోర్టుకు మెమో సమర్పించారు. అవా ర్డు రద్దు చేయడంతో తాను బెయిల్ వినియోగించుకోనని వివరించారు. ఈ నేప థ్యంలో తనకు రెగ్యులర్ బెయిల్ ఇ వ్వాలని అభ్యర్థిస్తూ జానీ మాస్టర్ న్యాయవాది రంగారెడ్డి జిల్లా కోర్టు(పోక్సో ప్రత్యేక కోర్టు)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు బుధవా రం వాదనలు జరిగాయి. విచారించిన న్యాయస్థానం తీర్పును ఈ నెల 14కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఆయన ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.