calender_icon.png 26 October, 2024 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల

26-10-2024 01:46:02 AM

రాజేంద్రనగర్, అక్టోబర్ 25: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. అవకాశాల పేరుతో జానీ మాస్టర్ తనను బెదిరించి పలుమార్లు లైంగిక దాడి చేశాడని ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యా దు చేయడంతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన గోవాకు పారిపోయారు.

గత నెల 19న నార్సింగి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడ జైలుకు పంపారు. అయితే, తనకు నేషనల్ అవార్డు వచ్చిందని, దానిని తీసుకోవడానికి ఢిల్లీ వెళ్లాలని జానీ మాస్టర్ కోర్టును అభ్యర్థించడంతో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు.

కేసుల నేపథ్యంలో అవార్డు కమిటీ తాత్కాలికంగా అవార్డును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆయన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేసుకొని కోర్టులో మెమో సమర్పించారు. రెగ్యులర్ బెయిల్ కోసం తిరిగి దరఖాస్తు చేయడంతో గురువారం ఆయనకు మంజూ రు చేసిన విషయం తెలిసిందే. దీంతో జానీ మాస్టర్ జైలు నుంచి విడుదలయ్యారు.