- అంగీకరించిన రంగారెడ్డి కోర్టు
- పోక్సో కేసుపై నిందితుడిని విచారించనున్న నార్సింగి పోలీసులు
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 25: పోక్సోలో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ చెంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉంటున్నాడు. కేసు సమగ్ర విచారణ విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు.
మంగళ వారం న్యాయమూర్తి పిటిషన్‌పై స్పందించి మర్నాటికి వాయిదా వేశారు. బుధవారం ఈ మేరకు విచారణ చేపట్టిన న్యాయస్థానం జానీమాస్టర్‌ను నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీలో విచారించేం దుకు అంగీకరించింది. ఎట్టిపరి స్థితుల్లోనూ థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దని ఆదేశించింది.
కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈనెల 28 సాయంత్రంలోపు విచారణ పూర్తి చేసి తిరిగి జానీ మాస్టర్‌ను చెంచల్‌గూడ జైలులో అప్పటించాల్సి ఉంటుంది. పోలీసుల విచారణలో తన అసిస్టెంట్‌పై లైంగిక దాడికి సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.