calender_icon.png 31 January, 2025 | 10:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్‌వెస్లీ

29-01-2025 02:00:02 AM

  1. దళితబిడ్డకు దక్కిన గౌరవం
  2. విద్యార్థి నేతగా ప్రయాణం..

వనపర్తి, జనవరి 28 (విజయక్రాంతి): సీపీఎం రాష్ట్ర నూతన కార్యదర్శిగా వనపర్తి జిల్లా అమరచింత గ్రామానికి చెందిన జాన్‌వెస్లీ నియమితులయ్యారు. ఓ దళిత బిడ్డకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పదవి రావడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి. జాన్‌వెస్లీ విద్యార్థి నేతగా రాజకీయాల్లో తన ప్రస్థానం మొదలుపెట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ సీపీ  రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు.

అమరచింత గ్రామానికి చెందిన మోగేజ్, బేతమ్మ దంపతులకు జాన్‌వెస్లీ నాల్గో సంతానం. ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు అమరచింత ప్రభుత్వ పాఠ  ఇంటర్మీడియట్ ఆత్మకూర్‌లో, డిగ్రీ గద్వాల ప్రభుత్వ కళాశాలలో అభ్యసించారు. 198  సీపీఎం అనుబంధ డీవైఎఫ్‌ఐ విద్యార్థి విభాగంలో నారాయణపేట డివిజన్ కార్యదర్శిగా ప్రస్థానం మొద   ఉమ్మడి ఏపీలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ యుగ్లేసియా దేశంలో నిర్వహించిన నేషనల్ యూ  కౌన్సిల్స్ సమావేశానికి హాజరయ్యారు.

కేవీపీఎస్ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. నాగర్‌కర్నూల్, వన  గద్వా  రంగారెడ్డి జిల్లాలకు ఇన్‌చార్జిగా ఉన్నారు. దళితబిడ్డ సీపీఎం రాష్ట్ర కార్య  నియమితులు కావడంతో బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అమరచింత మున్సిపాలిటీ కేం  సంబురాలు నిర్వహించుకుంటున్నారు.

రాష్ట్ర కమిటీలో జీ నాగయ్య, ఎస్ వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌రావు, చుక్కరాములు, టీ జ్యోతి, టీ సాగర్, అబ్బాస్, భాస్కర్, లక్ష్మి, పీ ప్రభాకర్, బీ రవికుమార్, నాగేశ్వర్‌రావు, జహాంగీర్ తదితరులను ఎన్నుకున్నారు.