calender_icon.png 28 January, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత సామరస్యానికి ప్రతీక జాన్ పహాడ్

25-01-2025 12:39:27 AM

 మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి 

హుజూర్ నగర్,జనవరి 24: మత సామరస్యానికి ప్రతీక జాన్ పహాడ్ దర్గా అని రాష్ట్ర మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు .  జాన్ పహాడ్ ఉర్సు  ఉత్సవాలల్లో భాగంగా  మిర్యాలగూడ ఎమ్మెల్యే బి లక్ష్మారెడ్డితో కలిసి శుక్రవారం గంధం ఊరేగింపులో పాల్గొని దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన జాన్ పహాడ్ దర్గాను లక్షలాది మంది భక్తులు,ముస్లింలు,హిందువులు దర్శించుకుని ప్రార్థనలు చేస్తారని తెలిపారు. పాలకీడు మండలంలోని  దర్గాను అన్ని విధాలుగా అభివృద్ధి  చేస్తామని తెలిపారు.

ఎమ్మెల్యే గా ఎంపీగా, ఉమ్మడి ఏపీలో కేబినెట్ మంత్రిగా, ప్రస్తుత  తెలంగాణలో కేబినెట్ మంత్రిగా దర్గాలో భక్తుల సౌకర్యాల మెరుగుదలకు నిరంత రం కృషి చేశానన్నారు.తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం తాను ప్రార్థిస్తున్నానని చెప్పారు. అదే విదంగా బెట్టా తండా లిఫ్టుకు , లిఫ్ట్ కు రోడ్డుకు నిధులు,మండల వ్యాప్తంగా రోడ్లకు రూ .60 లక్షలు మంజూరు చేశానని తెలిపారు.