ఆందోల్,(విజయక్రాంతి): జోగిపేటలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డిబి నాగభూషణం అరెస్ట్ చేసి రీమాండ్ పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. జోగిపేటలోని 217 సర్వే నంబర్ లో ఇనాం భూమిని శ్రీకాంత్ అనే ఫ్రొఫెసర్ గజిస్టెడ్ సంతకం ఫోర్జరీ చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. 2.11 గుంటల భూమికి తప్పుడు ద్రువ పత్రాలు సృష్టించాడని డిప్యూటీ తహశీల్దార్ మధుకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేసారు.నాగభూషణంను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన జోగిపేట పోలీసులు.