calender_icon.png 25 February, 2025 | 2:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా జోయెల్ డేవిస్

25-02-2025 02:25:51 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (విజ యక్రాంతి): హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా డీ జోయెల్ డేవిస్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా డాక్టర్ గజరావు భూపాల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా పనిచేస్తున్న జోయెల్ డేవిస్ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా బదిలీ కాగా, ఆ స్థానంలో 2008 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన డాక్టర్ గజరావు భూపాల్ బదిలీపై వచ్చారు.