వాషింగ్టన్: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్(US President Joe Biden), ఆయన భార్య, ప్రథమ మహిళ జిల్ బిడెన్ నివాళులర్పించారు. వైట్ హౌస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో, బిడెన్ యుఎస్-భారత్ సంబంధాలను బలోపేతం చేయడంలో మన్మోహన్ పాత్రను గుర్తుచేసుకున్నాడు. మన్మోహన్ సింగ్(Manmohan Singh) గొప్ప రాజనీతిజ్ఞుడి, అంకిత భావం గల ప్రజాసేవకుడని కొనియాడారు. భారతీయులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని బైడెన్ పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి 92 సంవత్సరాల వయస్సులో న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో కన్నుమూసిన విషయం తెలిసిందే.