వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కరోనా వైరస్ సోకింది. బైడెన్ కోవిడ్ బారిన పడినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. బైడెన్ స్పల్ప దగ్గు, జలుబుతో బాధపడుతున్నారని వెల్లడించింది. ఆయన ప్రస్తుతం డెలావేర్‌లోని రెహోబోత్‌లోని తన బీచ్ హౌస్‌లో ఐసోలేషన్ లో ఉన్నారని తెలిపింది. ఇంటి నుంచే బైడెన్ విధులు నిర్వహిస్తారని పేర్కొంది. ఆయన కోవిడ్ మందులు తీసుకుంటున్నాడని సూచించింది. నవంబర్ ఎన్నికలకు ముందు హిస్పానిక్ ఓటర్లను కూడగట్టే ప్రయత్నంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బుధవారం లాస్ వెగాస్‌ను సందర్శించి నప్పుడు కోవిడ్ -19 కు పాజిటివ్ పరీక్షించినట్లు వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది