పశువుపై దాడి
ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జోడేఘాట్ అడవుల్లో ఆదివారం రాత్రి ప్రవేశించిన పులి రెండు పశువులపై దాడి చేసినట్లు తెలిసింది. దీంతో మరోసారి గిరిగ్రామాలు భయాందోళనకు గురువుతున్నాయి.
మహారాష్ట్ర నుంచి కెరమెరి మండలం జోడేఘాట్ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు పులి పాదముద్రలను గుర్తించారు. డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ టిబ్రేవల్ రేంజ్ పరిధిలో సోమవారం పర్యటించారు.
పులి సంచరిస్తున్నందున రైతులు, ప్రజలు, పశువుల కాపరులు ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని కోరారు. పులికి హాని కలించే విధంగా ఎవరు కూడా చర్యలు తీసుకోవద్దన్నారు. పులి కనిపిస్తే వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
నిజామాబాద్ జిల్లాలో పులి కలకలం
కామారెడ్డి(నిజామాబాద్), నవంబర్ 18 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని విక్టరీ పాఠశాలకు సమీపంలోని అటవీ ప్రాంతంలో సోమవారం సాయంత్రం చిరుత పులి కనిపించినట్లు పశువుల కాపర్లు, రైతులు తెలిపారు. సాయంత్రంలోపే వ్యవసాయ పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లాలని అటవీ శాఖ రేంజ్ అధికారి గంగాధర్ రైతులకు సూచించారు.