calender_icon.png 31 March, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించాలి: జిల్లా కలెక్టర్ సంగ్వాన్

28-03-2025 03:06:53 PM

కామారెడ్డి, (విజయక్రాంతి): ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్(Collector Ashish Sangwan) అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామంలోని శ్రీ భీమేశ్వరాలయం సమీపంలోని చెక్ డ్యాం లోని పూడికతీత పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వేసవి కాలంలో ఉపాధి హామీ పథకం క్రింద కూలీలకు పనులు కల్పించాలని అన్నారు. గ్రామంలో 240 హౌస్ హోల్డ్స్ కి గాను 316 జాబ్ కార్డ్స్ ఉన్నాయనీ, 280 యాక్టివ్ కూలీలు పనులకు హాజరవుతున్నారని తెలిపారు. దాదాపు ఒక వారం నుండి చేపడుతున్న పూడికతీత పనుల్లో కూలీలకు కూలీ చెల్లించడం లేదని, పోస్టాఫీస్ ద్వారా చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని కూలీలు కలెక్టర్ కు వివరించారు.

పోస్టల్ శాఖ ద్వారా కాకుండా బ్యాంకు ఖాతాల ద్వారా కూలీ చెల్లించే విధంగా ఏర్పా టు చేయాలని జిల్లా గ్రామీణాభి వృద్ధి అధికారి సురేందర్ కు  సూచించారు. అనంతరం శ్రీ భీమేశ్వరాలయం లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ దేవాలయం పురాతన కాలం నాటిదని, పర్యాటకంగా అభివృద్ధి పరచాలని పూజారులు, గ్రామస్తులు కలెక్టర్ ను కోరారు. రోడ్డు సౌకర్యం, నీరు, టాయ్ లెట్స్ సౌకర్యం ఏర్పాటుచేయాలని కోరారు.  అనంతరం గ్రామంలోని నర్సరీ ను పరిశీలించి, ఇంటింటికీ పంపిణీ చేసే విధంగా పండ్లు, పూల మొక్కలను పెంచాలని తెలిపారు.

అనంతరం పల్లె ప్రకృతి వనంలో కలెక్టర్  మొక్కలకు నీరు పోశారు. ప్రతీ రోజు మొక్కలకు నీరు పోయాలని  తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా గ్రామస్తులు ప్రమీల ఇంటికి భూమి పూజ చేసి, నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ తెలిపారు. ఆ తరువాత బ్రహ్మాజీవాడ గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలకు వాటరింగ్ నిర్వహించారు. ఏవెన్యూ ప్లాంటేషన్ నిర్వహించాలని, గ్యాప్ లలో కొత్త మొక్కలు నాటాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రాజారాం, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, ఇన్చార్జి తహసీల్దార్ రేఖ, ఎంపీడీఓ సాజిద్, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు, ఇతర మండల అధికారులు, పాల్గొన్నారు.