calender_icon.png 3 April, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలి

02-04-2025 05:47:22 PM

నిరుద్యోగ కళాకారుల సంఘం డిమాండ్..

కామారెడ్డి (విజయక్రాంతి): సాంస్కృతిక సారధిలో నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్ర కమిటీ పెద్దలు  అనువోజు వెంకన్న, చక్రాల రఘు, దరువు అంజన్న, నకిరే కంటి కిరణ్, నేర్నాల కిషోర్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా ఉద్యమ నిరుద్యోగుల కళాకారుల సంఘం, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సొంటెం సాయిలు యాదవ్ బుధవారం కామారెడ్డిలో మీడియ సమావేశంలో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం కోసం కామారెడ్డి జిల్లా కళాకారులం గోసి గొంగడి కాలు గజ్జలు కట్టి డప్పు సంకనేసుకుని ఊరు వాడ పల్లెల్లో పట్టణాలలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా మా ఆట ద్వారా మా పాట ద్వారా ఇంకా ఉద్యమాన్ని ఉర్రూతలూగించి తెలంగాణ వచ్చేదాకా తెలంగాణలో నాలుకోట్ల ప్రజల్ని ఏకం చేసి తెలంగాణ వచ్చేదాకా ధూమ్ ధామ్ చేసి కొట్లాడి తెలంగాణ తెచ్చినం. తెలంగాణ వచ్చినంక మా బతుకులు రోడ్డుమీద పడ్డాయి. గత ప్రభుత్వం కేవలం 550 మందికి ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రభుత్వం రాగానే ఉద్యమ నిరుద్యోగ కళాకారులు అందరికీ సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది.

మాకు మాట ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వమే ఏర్పడి సంవత్సరం గడిచిపోయింది. కానీ ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు రాలేవు. దీని పట్ల మొన్న అసెంబ్లీ సమావేశాలలో సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, మెదక్ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి  వీళ్ళిద్దరూ కళాకారులకు సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు ఇవ్వాలని మాట్లాడినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం. సంతోషం వ్యక్తం చేస్తున్నాం. వారికి కళాభివందనాలు తెలియపరుస్తున్నాం. అట్లనే తెలంగాణలో ఉన్నటువంటి సీఎంతో సహా 119 ఎమ్మెల్యేలు, మంత్రులు, కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి  పెద్దలు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ, కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే కాటి పల్లి రమణారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు,  బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యే  పోచారం శ్రీనివాస్ రెడ్డి,  జుక్కల్ ఎమ్మెల్యే  లక్ష్మి కాంతారావు కామారెడ్డి జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు కనిపించి న్యాయం చేయాలని కోరుచున్నాము.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కళాకారులు ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సొంటెం సాయిలు యాదవ్ అన్యబోయిన శ్రీనివాస్ యాదవ్, సొంటెం రాజలింగం యాదవ్, బస్వాపూర్ దేవరాజ్ రెడ్డి, రాజయ్య ,ఎదురుగట్ల శంకర్ గౌడ్, వడ్ల వెంకన్న కత్తూరి కిషన్, గడ్డం శ్రీనివాస్, శీతాల శ్యామ్ యాదవ్, డప్పు స్వామి కుప్పరాల నరసింహులు, ఉప్పల్వాయి నరసింహులు, లక్ష్మణ్, స్వప్న, బాన్సువాడ అశోక్, తదితరులు పాల్గొన్నారు.