calender_icon.png 1 April, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2006 క్వాలిఫైడ్ జూనియర్ లైన్మెన్‌లకు ఉద్యోగాలు ఇవ్వాలి

25-03-2025 01:38:49 AM

హనమకొండ.మర్చి 24 ( విజయ క్రాంతి ) : టీజీ ఎన్పీడీసీలు పరిధిలో 2006లో  క్వాలిఫైడ్ అయిన జూనియర్ లైన్మెన్ లకు హై కోర్ట్ తీర్పు ప్రకారం వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని క్వాలిఫైడ్ జూనియర్  లైన్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి ని వేడుకున్నారు.

సోమవారం హనుమకొండ లోని  పబ్లిక్ గార్డెన్ లో వారు మాట్లాడుతూ  ఎన్పీడీసీఎల్ పరిధిలో 1500 మందిని జూనియర్ లైన్మెన్ గా ఎంపిక చేయగా ఆనాటి యజమాన్యం 1110 మంది జూనియర్ లైన్మెన్ లను తీసుకొని, మిగతవారిని ఖాళీలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసి వాటి ద్వారా ఎంపిక చేస్తుండగా 128 మంది లైన్మెన్లు హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.

2017లో హైకోర్టు వెంటనే జూనియర్ లైన్మెన్ లను ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆదేశించిన ఎలాంటి చర్యలు లేకపోవడంతో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన మేము నిర్లక్ష్యానికి గురయ్యారని ఆయన వ్యక్తం చేశారు. 2019లో హైకోర్టులో రిపిటిషన్ కేసు వేయగా ఫిబ్రవరి 22 న సెలెక్ట్ అయిన జూనియర్ లైన్మెన్ లను నాలుగు వారాల్లోపు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని  హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది అన్నారు.

19 ఏళ్లుగా కోర్టులచుట్టూ తిరుగుతూ ఎన్నో కష్టాలు అనుభవించామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లక్ష్మీపతి, కోశాధికారి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బి. మల్లేశం,జాయింట్ సెక్రెటరీ కె శ్రీనివాస్,తిరుపతి,సురేష్, నరసింహ రాజు,రమేష్, సంజీవ్,బీమేష్, తదితరులు పాల్గొన్నారు.