ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు చిప్పకుర్తి నారాయణ..
మంచిర్యాల (విజయక్రాంతి): ఎస్సీ సామాజిక వర్గంలో ఏబీసీడీ వర్గీకరించిన తర్వాతే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు చిప్పకుర్తి నారాయణ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని విశ్రాంతి భవన ఆవరణలో నూతనంగా ఎన్నికైన ఎంఆర్పీఎస్ పట్టణ మండల అధ్యక్ష, కార్యదర్శులను మాదిగ ఎంప్లాయిస్ సన్మానించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ... ఈ నెల 7న హైదరాబాద్ లో లక్ష డప్పులు, వేల గుంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఊరి నుంచి వేలాదిగా మాదిగలు హైదరాబాద్ కు తరలిరావాలని కోరారు. ఏబీసీడీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేంత వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అవునూరి లచ్చన్న, ముల్కల్ల రంజిత్, ఏజీపీ వేల్పుల సత్యం, గొడిసెల రవి, చాతరాజు శివశంకర్, కలాల రమేష్, అల్లంపల్లి రమేష్, చాతరాజు రాజశేఖర్, మండల అధ్యక్షులు అవునూరి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మంద మధు, పట్టణ అధ్యక్షులు కల్లేపల్లి విక్రం, అడ్లూరి శివకుమార్ తదితరులు పాల్గోన్నారు.