calender_icon.png 7 February, 2025 | 2:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిట్స్ విద్యార్థులకు ప్రభుత్వ, ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలు

07-02-2025 01:48:53 AM

కరీంనగర్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలకు చెందిన విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పొందారు. సివిల్ బ్రాంచికి చెందిన ఎం రఘు జేటీవోగా, జి శ్రీకాంత్ అసిస్టెంట్ ఇంజనీర్ గా, ఎ సంగీత జేటీవోగా, ఎ మయూరి అసిస్టెంట్ ఇంజనీర్ గా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.

అలాగే ఈ ఎస్‌ఈ బ్రాంచికి చెందిన ఏడుగురు విద్యార్థులు శ్రీయ మద, మనస్విని పెద్ది, శ్రీజ సైని, ప్రీతి ఎడ్ల, జుఫిషాన్ ఖుర్షీద్, విశాఖ సోని, శివాని బైరెడ్డిలు 3.6 లక్షల ప్యాకేజీతో ఇన్ఫోసిస్ ఎంఎన్సీ కంపెనీలో సిస్టర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు సాధించారు.

ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్రావు, కరస్పాండెంట్ జె సుమిత్సాయి, ప్రిన్సిపాల్ డాక్టర్ అనిల్ కుమార్, అకాడమిక్ డీన్ పీకే వైశాలిలు అభినందించారు.