27-04-2025 12:21:24 AM
ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: భారత్‌లో జనాభా కంటే ఉద్యోగాల వృద్ధి వేగం గా జరుగుతోందని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వెల్లడించింది. 2021 22 నుంచి పని చేసే వయస్సు గల జనాభా కంటే ఉద్యోగ వృద్ధి వేగంగా జరుగుతోందని నివేదికలో తెలిపింది. ఈ క్రమంలోనే శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని వెల్లడించింది. అలాగే, అర్బన్ ప్రాం తాల్లో నిరుద్యోగ రేటు 6.6 శాతానికి పడిపోయిందని, 2017 తర్వాత ఇదే అత్యల్పమని వివరించింది.