12-03-2025 12:00:00 AM
పీసీసీ అధికార ప్రతినిధి దయాకర్
హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఉద్యోగాల భర్తీ సాధ్యమని రుజువైందని పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ చెప్పారు. పది ఏళ్లలో సాధ్యంకాని గ్రూప్ గ్రూప్ ఉద్యోగాల భర్తీని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..
బీఆర్‌ఎస్ హయాంలో పేపర్ లీకేజీల భయంతో ఎంతోమంది నిరుద్యోగులు భయంతో పరీక్షలకు దూరమయ్యారని ఆరోపించారు. దేశంలో తెలంగాణలోనే నిరుద్యోగులకు అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఇప్పటికే 54 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, భవిష్యత్‌లో మరిన్ని భర్తీ చేస్తుందన్నారు.