calender_icon.png 27 November, 2024 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఉద్యోగాలు?

27-11-2024 12:00:00 AM

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ-2008లో నష్టపోయిన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కాంట్రాక్ట్ ఉద్యోగాలను ఇవ్వనుంది. ఇందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. దాదాపు 1,390 మంది అభ్యర్థులను కాంట్రాక్టు టీచర్లుగా నియమించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది.

వీరికి సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టారు. నల్లగొండ, హనుమకొండ, ఖమ్మం, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువగా బాధితులు ఉన్నట్లు గుర్తించారు.

ఇందులో భాగంగా ఒక్కో జిల్లాకు ఒక సీనియర్ అధికారిని పరిశీలకులుగా విద్యాశాఖ నియమించి ఇటీవల ఈ ప్రక్రియను పూర్తి చేసింది. అభ్యర్థుల జాబితా ఫైనల్ కావడంతో సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించి ఆ పోస్టుల్లో డీఎస్సీ అభ్యర్థులకు త్వరలోనే కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వనున్నారు.