06-03-2025 12:38:16 AM
కోదాడ మార్చి 5: విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని స్లేట్ ది స్కూల్ ఫౌండర్ వాసిరెడ్డి అమర్ నాధ్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని స్థానిక కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో అమృత రామానుజరావు ట్రస్టు ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛాలెంజ్ అనే అంశంపై ట్రస్ట్ చైర్మన్ కొండపల్లి శేష ప్రసాద్ అధ్యక్షతన కళాశాల విద్యార్థులకు సెమినార్ నిర్వహించారు.
సెమినార్ ను ఉద్దేశించి వాసిరెడ్డి అమర్ నాధ్ మాట్లాడుతూ ఏ రంగంలో చూసినా ఏఐ హవా నడుస్తుందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో భయం అవసరం లేదన్నారు. కళాశాల డైరెక్టర్ నాగార్జున, ప్రిన్సిపల్ గాంధీ, కోమరగిరి రంగారావు, ట్రస్ట్ సభ్యులు కొండపల్లి శారద ప్రసాద్, కొండపల్లి శ్రీ వాత్సవ్, కొండపల్లి శ్రీకర్, న్యాయవాది అక్కిరాజు యశ్వంత్ పాల్గొన్నారు.