calender_icon.png 12 February, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ నెల 14న జోబోథాన్

12-02-2025 01:03:20 AM

* శ్రీ శక్తి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి):  ఈ నెల 14న శ్రీ శక్తి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, బేగంపేట ఆధ్వర్యంలో జోబోథాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి  సంబం ధించిన పోస్టర్‌ను మంగళవారం జాబోతాన్ నిర్వాహకులు రాష్ట్ర ప్రభుత్య ప్రత్యేక కార్యదర్శి జయష్ రంజన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ మేళాలో సుమారుగా 25 ప్రముఖ జాతీయ అంతర్జాతీయ సంస్థ లు పాల్గొననున్నాయని తెలిపారు. ఉద్యోగమేళాలో పాల్గొనాలనుకునే  నిరుద్యోగులు, ఆతిధ్యరంగ విద్యార్థులు, నిపుణులు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని చెప్పారు.

వివరాలకు 9440409988 నంబర్‌లో, లేదా www.ihmshrishakti.com<ht tp://www.ihmshrishakti.com> వెబ్‌సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ జాబ్ ఫెయిర్‌లో తాజ్ గ్రూప్, ఐటీసీ వెల్కమ్, హయత్, మారియట్, రాడిసన్ వంటి సంస్థలు పాల్గొనున్నాయి.  ప్రముఖ విదేశీ కన్సల్టెన్సీ సంస్థలైన  కెరీర్ క్రాఫ్టర్, ఏఎస్పీడీ, ట్రివల్ చాప్టర్ వంటి సంస్థలు స్కిల్ ఇమిగ్రేషన్, జె1 వీసా, ఇంటర్నేషనల్ ట్రైనింగ్ పట్ల ఆసక్తి గల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి.