ఐసోలేషన్‌లో అమెరికా ప్రెసిడెంట్
ట్రంప్‌ను ఓడించలేవు, తప్పుకోవాలన్న నాన్సీ పెలోసీ
న్యూఢిల్లీ, జూలై 18 : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కొవిడ్ సోకినట్లు వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా లాస్‌వేగాస్ వెళ్లిన ఆయనకు కొవిడ్ పరీక్షలు పాజిటివ్‌గా తేలినట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్ పియర్ తెలిపారు. బైడెన్ ప్రస్తుతం డెలావేర్ సముద్ర తీరంలో ఉన్న తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. బైడెన్ కొవిడ్ చికిత్స తీసుకుంటున్నారని, అక్కడి నుంచి విధులు నిర్వహిస్తారని తెలిపారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా లాస్ వెగాస్‌లో జరిగిన ఒక సదస్సులో బైడెన్ పాల్గొన్నారు. ప్రసంగానికి ముందు కొవిడ్ టెస్టు చేయడంతో అందులో పాజిటివ్‌గా వచ్చింది.
ట్రంప్‌ను ఓడించలేవు.. తప్పుకో
వయోభారం, మతిమరుపు, అనారోగ్య సమస్యలు, డిబేట్లలో తడబడటం వంటి కారణాలతో అధ్యక్షబరిలో నుంచి తప్పుకోవాలని సొంతపార్టీ డెమోక్రటిక్ నేతల నుంచి బైడెన్‌పై ఒత్తిడి పెరిగింది. ట్రంప్‌ను ఓడించే శక్తి లేదని, అభ్యర్థిత్వం నుంచి వైదొలగాలని మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా తన అభిప్రాయం తెలియజేశారు.