హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): రాష్ట్ర విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు కలిసి సమావేశం కానున్న నేపథ్యంలో సొంత రాష్ట్రాలకు ఉద్యోగ బదిలీలకు అవకాశం కల్పించాలని నాన్‌లోకల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (ఎన్‌ఎల్‌టీఏ) అధ్య క్ష, ప్రధాన కార్యదర్శులు మోహన్ రావు, సూర్యనారాయణ విజ్ఞప్తి చేశా రు. 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో అంతరాష్ట్ర బదిలీలకు అప్షన్ ఇవ్వని జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్‌కు చెందిన ఉపాధ్యాయులకు మానవతా దృక్పథంతో అవకాశమివ్వాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్ర విభజనలో అప్పుడు కేవలం రాష్ట్రస్థాయి పోస్టులకు అవకాశం కల్పించారని, జిల్లా, జోనల్‌కు చెందిన స్థానికత ఉన్న ఉద్యోగులకు అవకాశం కల్పించలేదని పేర్కొన్నారు.