calender_icon.png 26 March, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

25-03-2025 05:43:31 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): ఆశ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని యూనియన్ మండల అధ్యక్షురాలు తాడూరి లత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్ల యూనియన్ హైదరాబాదులో శాంతియుత ధర్నాకు పిలుపునివ్వగా ఆశ వర్కర్లను సోమవారం అక్రమ అరెస్టు చేశారు. నిరసనగా మంగళవారం కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. సిఐటియూ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు మానవహారంగా ఏర్పడి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షురాలు తాడూరి లత మాట్లాడుతూ.. ఆశ వర్కర్ల శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అక్రమ అరెస్టులతో అడ్డుకున్నారని ఆరోపించారు.

తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. కనీస వేతనం 18 వేల రూపాయలను చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశ వర్కర్లకు ఉద్యోగం కల్పించాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి హెల్త్ కార్డులు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కొప్పుల శంకర్, ఆశ వర్కర్ల సంఘం ఉపాధ్యక్షురాలు కాళేశ్వరపు పుష్పలత, జంగా రమాదేవి, ఎడుముల సుజాత, విజయలక్ష్మి, మదీన, ఉమ, సునీత, అరుణ, తునికి విమల, కవిత, కొక్కుల సునీత, స్వరూప, శారదా తదితరులు పాల్గొన్నారు.