calender_icon.png 16 March, 2025 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణ అమలు చేశాకే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి

16-03-2025 12:00:00 AM

5వ రోజుకు చేరిన నిరాహార దీక్షలు

తలకొండపల్లి,మార్చి 15(విజయక్రాంతి): మాదిగల జనాభా దామాషా ప్రకారం ఎస్సి వర్గీకరణ అమలు చేసాకే ఉద్యోగ నియామకలు చేపట్టాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ ఆద్వర్యంలో తలకొండపల్లి మండల కేంద్రం లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు  శనివారం నాటికి 5వ రోజుకు చేరుకున్నాయి.దీక్షా శిభిరాన్ని ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధికా ర ప్రతినిది పోతుగంటి కృష్ణ మాదిగ, పూలే అంబేద్కర్ జాతర కమిటి రంగారెడ్డి జిల్లా అద్యక్షుడు జి.సుదాకర్‌లు సందర్శించి సం ఘీభావం ప్రకటించారు.

ఉద్యోగ నియమకాల కోసం నిర్వహించిన పోటీ పరీక్షల పలితాలను ఎస్సి వర్గీకరణ తరువాత విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ తరపున ప్రభుత్వాన్ని విజ్ణప్తి చేసామని, ప్రభుత్వం తమ విజ్ణప్తిని పట్టించుకోకుండా పలితాలను విదులచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి కైన ప్రభుత్వం స్పందించి ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలోనే ఎస్సి వర్గీకరణకు చట్టబద్దత కల్పించాకే ఉద్యోగ నియమకాలు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఎమ్మా ర్పీఎస్ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెర్మాం డ్ల జ్యోతయ్య, జీ.వెంకటయ్య పాల్గొన్నారు.