calender_icon.png 20 March, 2025 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలి

17-03-2025 12:00:00 AM

 రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ 

కల్వకుర్తి మార్చ్ 16 : సుప్రీం కోర్టు తీర్పుతో ఎస్సీ వర్గీకరణకు చట్టం తీసుకువస్తున్న తెలంగాణ ప్రభుత్వం వాటి ఆధారంగానే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం మండల తాసిల్దార్ కార్యాలయం  ఎదురుగా చేపట్టిన దీక్షకు ఆయన పాల్గొని మాట్లాడారు.  ఎస్సీ వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తే ఎస్సీ ఉద్యోగాలన్ని మాలలకే చెందుతాయని అన్నారు.

ఎస్సీలలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఎస్సీ వర్గీకరణ లేకపోవడం వల్ల గత 70 ఏళ్లుగా ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.  సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేయాలని ప్రయత్నించడం దారుణమన్నారు.మార్చి 17 న ఎస్సీ వర్గీకరణ చట్టం అసెంబ్లీలో పెడతామని ప్రకటించిన ప్రభుత్వం అప్పటి వరకు ఉద్యోగ పరీక్షల ఫలితాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

వర్గీకరణ జరిగేంత వరకు పోరాటం ఆగదని వెంటనే ఎస్సీ వర్గీకరణ చట్టం అసెంబ్లీలో ఆమోదించడంతో పాటు త్వరగా అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  వీరస్వామి మాదిగ, మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కల్వకుర్తి డివిజన్ అధ్యక్షులు ఇంజమూరి భాస్కర్, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు తుడుం కిరణ్ కుమార్ మాదిగ,మబ్బు రామరాజు మాదిగ మాజీ కౌన్సిలర్,

ఇంజమూరి వల్లభ శ్రీను మాదిగ, పాలాది పరశురాములు మాదిగ, ముప్పిడి కృష్ణ మాదిగ,  ఎమ్మార్పీఎస్ నాయకులు.. వర్షపాకుల శేఖర్, పోలే అంజి, వీరపాకల సురేష్ నేరటి నాని , జగన్, విజయ్, వీరపాకల సురేష్, రాజు,  మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.