24-02-2025 12:47:05 AM
ఎలక్ట్రిసిటీ ఇంజినీర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఆ శాఖ లో ఉద్యోగాలను భర్తీ చేస్తామని, తద్వారా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆదివారం ప్రజాభవన్‌లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఈఏ ఈఏ) నేతలు డిప్యూటీ సీఎంను కలిశారు. రామగుండంలో 800 మెగావాట్ల నూతన విద్యుత్ కేంద్రాన్ని 100 శాతం జెన్కో ఆధ్వర్యంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల డిప్యూటీ సీఎంకు ఇంజినీర్లు కృతజ్ఞతలు తెలిపారు.
జెన్‌కో, ట్రాన్స్ కో, డిస్కం కంపెనీల్లో నియామకాలు, పదోన్నతులకు సంబంధించిన సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సం దర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఇటీవల ఇచ్చి న పదోన్నతుల గురించి త్వరలోనే ఉత్తర్వులు వచ్చేలా నిర్ణయం తీసుకుంటా మన్నారు. కార్యక్రమంలో టీఈఏఈఏ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి బట్టు హరీశ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్ ఇమ్రాన్, ఏఈలు యాదగిరి, సమీర్, పిల్లి రాజు, అనిల్ రెడ్డి, నాగరాజు, అశోక్, మధు పాల్గొన్నారు.