calender_icon.png 19 January, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మారుతి నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ఉద్యోగ నియామకాలు

18-01-2025 08:25:43 PM

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలోని మారుతీ నర్సింగ్ కళాశాలలో జి ఎన్ ఎం  నర్సింగ్ కోర్స్ పూర్తి చేసిన 69 మంది విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్ ద్వారా 'ఒమెగా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ - హైదరాబాద్' లో 32 మందికి, కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ నందు 17 మంది, 'భాస్కర మెడికల్ కాలేజ్ హాస్పిటల్ హైదరాబాద్'లో 20 మందిని ఎంపికై శనివారం ఉద్యోగ నియామకాలు చేపట్టినారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ డా.ఎస్.ఎల్. కాంతారావు, చైర్మన్ డా.బి.సుబ్బరాజు మాట్లాడుతూ... ఎంపికైన విద్యార్థులను, అధ్యాపకులను అభినందించినారు.

నర్సింగ్ వృత్తి పవిత్రమైందని, విధి నిర్వహణ బాధ్యతతో చేపట్టాలని, స్పెషాలిటీ విభాగాల్లో నైపుణ్యత పెంచుకోవాలని విద్యార్థులకు సూచించినారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ మేము మారుమూల గ్రామాలలో చదివి అతి పేద కుటుంబాల నుండి వచ్చామని, నేడు కార్పోరేట్ హాస్పిటల్స్లో ఉద్యోగ అవకాశం కల్పించిన కళాశాల యాజమాన్యం వారికి మరియు ఓమెగా హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్, భాస్కర మెడికల్ కళాశాల & హాస్పిటల్ వారి మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలిపినారు.