నిర్మల్,(విజయక్రాంతి): ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా జిల్లాలో నైపుణ్య శిక్షణ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(Collector Abhilasha Abhinav) అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలపై సమావేశం నిర్వహించి అధికారులకు మార్గదర్శకం చేశారు. ప్రైవేటు కంపెనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పని గ్యారంటీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్(Additional Collector Faizan Ahmed), కార్మిక శాఖ అధికారి ముత్యంరెడ్డి, పరిశ్రమల శాఖ అధికారి నర్సింహారెడ్డి, యువజన శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.