22-02-2025 07:02:24 PM
తలకొండపల్లి,(విజయక్రాంతి): తలకొండపల్లి మండలం చుక్కాపూర్, ఎడవల్లి గ్రామాలకు చెందిన 23 మంది మహిళలకు ఎలక్ట్రానిక్స్ కంపనీ(Electronics Companies)లో ఉద్యోగావకాశాలు పొందారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం(Skill Development Program)లో భాగంగా ఐక్యతా ఫౌండేషన్(Unity Foundation) ఆద్వర్యంలో తుక్కుగూడలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపనిలో శనివారం 25మంది మహిళలకు ఇంటర్యూలు నిర్వహించారు. ఇందులో 23 మంది మహిళలు ఉద్యోగాలకు ఎంపికయ్యరని ఇక్యతా ఫౌండేషన్ ఛైర్మన్, టాక్స్ సిఓఓ సుంకిరెడ్డి, రాఘవేందర్ రెడ్డి అన్నారు. వీరు రెండు రోజులలో ఉద్యోగాలలో చేరి విదులకు హాజరౌతారని చెప్పారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ మహిళలకు ఉపాది అవకాశాలు కల్పించాలానే లక్ష్యంతో ప్రభుత్వం పలు కంపనీలతో చర్చలు జరిపి ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన మహిళలు ఉపయోగించుకుని లబ్ది పొందాలని రాఘవేందర్ రెడ్డి కోరారు.ఉద్యోగాలు పొందిన మహిళలు రాష్ట్ర ప్రభుత్వానికి,రాఘవేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.