calender_icon.png 15 March, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగ అవకాశాలు కాంగ్రెస్‌తోనే సాధ్యం

15-03-2025 12:21:05 AM

 రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్

తుంగతుర్తి, మార్చి 14: యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ దేనిని తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ కమిటీ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు శుక్రవారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఆయన మాట్లాడుతూ తుంగతుర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ అధ్యక్షతన ఈనెల 16న జరిగే ఏబిసిడి వర్గీకరణ, బి బి కులగలను సర్వే కృతజ్ఞత సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఇట్టి సభకు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు తెలిపారు.

సభను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల బుచ్చిబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, తుంగతుర్తి మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్,నాగారం మండల అధ్యక్షుడు తోడుచు లింగయ్య,  అవిలమల్ల యాదవ్,  ఉప్పుల రాంబాబు, యువజన కాంగ్రెస నాయకులు పాల్గొన్నారు