సీఎస్‌కు తెలంగాణ ఉద్యోగుల సంఘం జేఏసీ వినతి
హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): ఈనెల 21వ తేదీలోగా ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డెడ్‌లైన్ విధించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారిని కలిసి జేఏసీ నాయకులు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస్‌రావుతోపాటు మరికొందరు కలిసి వినతిపత్రం అందజేశారు.
పెండింగ్ సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యోగుల ఒత్తిడి మేరకు ఈనెల 22న తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తి కావొస్తున్నా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను పరిష్కరించలేదని పేర్కొన్నారు. తమతో చర్చలు జరిపి వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.