కరీంనగర్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళా శాలలో తెలంగాణ స్కిల్ అండానాలెడ్జ్ సెంటర్ (టీఎస్కేసీ) ఆధ్వర్యంలో ఈ నెల 7న ఉద్యోగామేళా నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి వరలక్ష్మీ, టీఎస్ కేసి కో ఆర్డినేటర్ డాక్టర్ డి శ్రీనివాస్ ఒక సం యుక్త ప్రకటనలో తెలిపారు.
కనెక్ట్ క్యూ, హె ట్రో, రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్స్యూరెన్స్, పీఎస్ సొల్యూషన్స్, వెంకటేశ్వర అసోసి యేట్స్, యాక్సిస్ బ్యాంకు, తదితర కంపె నీలు పాల్గొంటున్నాయని, 2021, 2022, 2023, 2024, ప్రస్తుతం ఫైనల్ సెమిస్టర్ చదువుకున్న డిగ్రీ,ఈ పీజీ విద్యార్థులు అరులని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల అ భ్యర్థులు ఉదయం 9 గంటలకు రెస్యూమ్, సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు. ఇత ర వివరాలకు 9912093500 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.