calender_icon.png 13 February, 2025 | 9:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈనెల 12న జాబ్ మేళా

10-02-2025 04:34:27 PM

పిఓ రాహుల్...

భద్రాచలం (విజయక్రాంతి): సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ, భద్రాచలం ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో గల గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే నిమిత్తం ఈనెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో నేరుగా ఉపాధి కోసం మెడ్ ప్లస్, నవత రోడ్డు ట్రాన్స్పోర్ట్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు, గిరిజన నిరుద్యోగ యువతకు ఐటిసి ప్రథమం సంస్థ ద్వారా బ్యూటీషియన్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ శిక్షణలను రెండు నెలల ఉచిత భోజన వసతితో పాటు శిక్షణ ఇప్పించి/స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు.

విద్యార్హతలు ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ, డిప్లొమా, పీజీ, బీటెక్ చదివి ఉండవలెనని ఆయన అన్నారు. ఆసక్తి గల నిరుద్యోగ గిరిజన యువత విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, కుల దృవీకరణ జిరాక్స్ సర్టిఫికెట్లతో ఈనెల 12వ తేదీ ఉదయం 9 గంటలకు ఐటిడిఏ భద్రాచలం ప్రాంగణంలో గల యూత్ ట్రైనింగ్ సెంటర్ నందు ఇంటర్వ్యూకి హాజరు కాగలరని, పూర్తి సమాచారం కొరకు 81799 25586, 63026 08905 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.