- 228.07 కోట్లతో 15,094 పనులు
- రాష్ట్రవ్యాప్తంగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు
- ములుగు జిల్లాలో పనులు ప్రారంభించిన మంత్రి సీతక్క
హైదరాబాద్, నవంబర్ 26 (విజయ క్రాంతి): ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా గ్రామపంచాయతీల్లో పండగ వాతావరణం నెలకొంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్ల నిధులతో పల్లెల్లో అభివృద్ధి పనులకు శంకుస్థానలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర కార్యక్రమాన్ని ములుగు జిల్లాలోని ఇంచర్ల గ్రామంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు.
ఇంచర్ల గ్రామంలో రూ.35 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం, రూ. 50 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, రూ.20 లక్షలతో జీపీ నూతన భవన నిర్మాణ పనులకు సీతక్క శంకుస్థాపన చేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో మం త్రులు, ఎమ్మెల్యేలు నూతన పనులను ప్రారంభించారు. ఒకేరోజు రూ.228.07 కోట్ల ఉపాధి నిధులతో 15,094 పనులకు శ్రీకారం చుట్టారు.
ఇందులో రూ.42.21 కోట్లతో 28 గ్రామీణ రహదారుల పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మం త్రి సీతక్క మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించి ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడం, ప్రతి కుటుంబానికి పని కల్పించడం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, సుస్థిరమైన ఆస్తులను సృష్టించడమే లక్ష్యం గా పనులు చేపట్టినట్టు పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు.
పాల్గొన్న ప్రజా ప్రతినిధులు..
అలాగే వివిధ జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పనుల జాతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సర్కార్ చేపట్టిన ఉపాధి పనులను వివరించారు.