calender_icon.png 20 January, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు కోహిర్‌లో ఉపాధి మేళా

05-07-2024 12:14:41 AM

కోహీర్, జూలై 4: తెలంగాణ పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో, స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ ఆధ్వర్యంలో కోహీర్ ఎంపీపీ కార్యాలయంలో జూలై 5(నేడు)న నిరుద్యోగ యువతీయువకులకు శిక్షణ ఉపాధి మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జాబ్ రిసోర్స్ పర్సన్ అరుణజ్యోతి తెలిపారు. డాటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంట్స్ అసిస్టెంట్, కంప్యూటర్ హార్డ్‌వేర్ అసిస్టెంట్, ఆటోమొబైల్ సర్వీసింగ్, సెల్‌ఫోన్ రిపేర్, ఎలక్ట్రీషియన్‌తో పాటు వివిధ కోర్సుల్లో శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా కోర్సులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 91339 08000, 91339 08111 నంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.