24-02-2025 12:00:00 AM
ఖమ్మం, ఫిబ్రవరి 23 ( విజయక్రాంతి ): స్థానిక ఎస్.ఆర్.బి.జి.ఎన్.ఆర్ కళాశాల ప్లేస్ మెంట్ సెల్ -తెలంగాణ స్కిల్స్, నాలెడ్జ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో 25వ తేదీ మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహి స్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మొహ్మద్ జాకిరుల్లా ఆదివారం ఒక ప్రకట నలో తెలిపారు. ఈ మేళా మ్యాజిక్ ఇండి యా ఫౌండేషన్ వారి సౌజన్యంతో నిర్వహిం చబడుతుందని వెల్లడించారు.
టెక్ మహే్ంర ద, జెన్ ప్యాక్ట్, ముత్తూట్ ఫైనాన్స్ , హెచ్.డి. ఎఫ్.సి, క్యూస్ కారప్స్ లిమిటెడ్, హె.చ్.ఆర్. హెచ్ సర్వీసెస్ నెక్స్ట్లిమిటెడ్, 2050హెల్త్ కేర్ కంపెనీలు పాల్గుంటున్నా యని తెలిపారు. ఐ.టి సర్వీసెస్, బ్యాంకింగ్, బి.పి.ఓ విభాగా లలో, ఉద్యోగాలకోసం ఈమేళా నిర్వహించ బడుతుందని తెలిపారు.
ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు, ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు, 2021నుండి, 2025 వార్షిక విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు రెజ్యూమ్ కాపీ, సర్టిఫికెట్స్ జిరాక్సు కాపీలు, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరు కావాలని సూచించారు.