హైదరాబాద్, ఆగస్టు 6 (విజయ క్రాంతి): ఉపాధి కల్పనలో మహిళలకు కూడా అవకాశం కల్పించడమే లక్ష్యంగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నామని తెలంగాణ డిజిటల్ ఎప్లాయి మెంట్ ఎక్ఛేంజ్(డీట్) జనరల్ మేనేజర్ అనిల్ పావులూరి తెలిపారు. ‘జాబ్ ఫెయిర్ ఫర్ ఉమెన్’ కార్యక్రమాన్ని గురువారం జూబ్లీహిల్స్ అంబేద్కర్ యూనివర్సిటీలోని వీక్షు హబ్ కార్యాలయంలో నిర్వహించనున్నట్టు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈవెంట్‌కు వీక్షు సహకారించడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. ఈ జాబ్ ఫెయిర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐకియా, రిలయన్స్, నిప్పన్ లైఫ్ ఇన్స్యూరెన్స్, మెడ్‌ఫ్లస్, టాటా మోటార్స్, మ్యాక్స్, గోపిజ్జా, ఇతర కంపెనీలు కూడా పాల్గొంటాయని వివరించారు. ఇప్పటికే 4000 దరఖాస్తులు నమోద య్యాయని తెలిపారు.