calender_icon.png 7 February, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10న మేడ్చల్ ఐటీఐలో జాబ్ మేళా

07-02-2025 12:00:00 AM

మేడ్చల్, ఫిబ్రవరి 6 (విజయ క్రాంతి): మేడ్చల్ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో ఈనెల 10న పిఎంఎన్‌ఏఎం పథకం ద్వారా అప్రెంటిస్, జాబ్ మేళా జరుగుతుందని ప్రిన్సిపల్ హనుమాన్ నాయక్ తెలిపారు. జాబ్ మేళాలో మేడ్చల్ పారిశ్రామిక ప్రాంతంలోని 30 కంపెనీలు పాల్గొంటున్నాయని, 800 కు పైగా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసే అవకాశం ఉందని తెలిపారు.

ఆసక్తిగల అభ్యర్థులు ఎస్‌ఎస్సి మెమో, ఐటిఐ మెమో, ఆధార్ కార్డు, పాన్ కార్డు, సేవింగ్ అకౌంట్ పాస్ బుక్, పాస్పోర్ట్ సైజు ఫోటో జతతో రెండు బయోడేటా కాపీలు తీసుకొని రావాలని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.