calender_icon.png 19 April, 2025 | 7:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ కళాశాలలో జాబ్ మేళా

16-04-2025 06:54:31 PM

బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నిర్వహించిన న్యూ లాండ్ లాబరేటరీ మెగా జాబ్ మేళాకు మంచి స్పందన వచ్చిందని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేఖ్ సలాం పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగుల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్న జాబ్ మేళాలు నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని అన్నారు. అదేవిధంగా ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.