calender_icon.png 12 January, 2025 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు వరం

04-08-2024 01:51:33 AM

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ 

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభు త్వం ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణలో కేసీఆ ర్ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆరోపించారు. ప్రభు త్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో నిరుద్యోగులతో కలిసి శనివారం ఆయన  గన్‌పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో నిరుద్యోగుల పాత్ర కీలకంగా ఉందన్నారు. నిరుద్యోగులకు భరోసా ఇచ్చేందుకే యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెం డర్‌ను ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. ఇది నిరుద్యోగులకు వరమని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు.