- కొత్త రేషన్ కార్డుల జారీకి మంత్రివర్గం ఆమోదం
- ఆరోగ్యశ్రీ కార్డులు వేరుగా పంపిణీ
- భూమాతగా ధరణి పోర్టల్ పేరు మార్పు
- మంత్రి పొంగులేటి వెల్లడి
- భూమాతగా ధరణి పోర్టల్ పేరు మార్పు
- గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్‌అలీఖాన్ పేర్ల ప్రతిపాదన
- ఇషాషింగ్, నిఖత్ జరీన్, సిరాజ్‌కు ఇంటిస్థలం
- మల్లన్నసాగర్ ద్వారా హైదరాబాద్‌కు తాగు నీరు
- మూసీ సుందరీకరణ, నిజాం షుగర్స్ పునరుద్ధరణ
- గౌరవెళ్లి ప్రాజెక్టుకు 437 కోట్ల విడుదల
- ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఉద్యోగ రీనోటిఫికేషన్లు
హైదరాబాద్, ఆగస్టు1 (విజయక్రాంతి): రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర మంత్రివర్గ భేటీ అయ్యింది. జాబ్ క్యాలెండర్ ప్రకటన, కొత్త రేషన్‌కార్డుల జారీ, ఆరోగ్యశ్రీ కార్డులను వేరుగా ఇవ్వడం, గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీల భర్తీతోపాటు జీహెచ్‌ఎంసీలో ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న గ్రామాల విలీనం, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నది.
క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రు లు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి , పొన్నం ప్రభాకర్ మీడియాకు వివరాలువెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గౌరవెళ్లి ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేయడానికి రూ. 437 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో జాబ్ క్యాలెంబర్‌ను ప్రకటిస్తామని, మ్యానిఫెస్టోలోని అంశాలన్నింటిని నేరవేరుస్తామని చెప్పారు. క్రీడాకారులు, విధి నిర్వ హణలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణ యం తీసుకున్నట్టు వివరించారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీల భర్తీకి ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లతో ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
నిజాం చక్కర పరిశ్ర మ పునరుద్ధరణ, హైదరాబాద్‌లో మూసీ సుందరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ జంట జలాశ యాలను తరలించి తాగునీటిని అందిస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తోందని, ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగాల నోటిఫి కేషన్లపై రీనోటిఫికేషన్ ఇచ్చి వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయాలు ఉంటాయ ని చెప్పారు. వర్గీకరణ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి అందరికంటే ముందే స్పందించారని అన్నారు. కుల గణన తర్వాత రిజర్వేషన్ల అంశాలను పరిగణనలోకి తీసుకునే అవకా శం ఉందని తెలిపారు.
గౌరారం ప్రాజెక్టును బీఆర్‌ఎస్ నిర్లక్ష్యం చేసింది : మంత్రి పొన్నం
గౌరారం ప్రాజెక్టును గత బీఆర్‌ఎస్ సర్కా ర్ పదేళ్లుగా నిర్ల క్ష్యం చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆ ప్రా జెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని, అం దుకు రూ.437 కోట్లు కేటాయించాలని క్యాబినెట్‌లో నిర్ణయించడం అభినందనీయమని అ న్నారు. గౌరారం ప్రాజెక్టు పూర్తయితే హుస్నాబాద్‌లో 57,852 ఎకరాలు, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో 48,148 ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎం వైఎస్సార్ 2007లో దీనికి శంకుస్థాపన చేశారని, ఇప్పు డు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పనులను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ధరణి పోర్టల్ పేరు భూమాతగా మార్పు
ధరణి పోర్టల్‌ను భూమాతగా మార్చాలని క్యాబినెట్‌లో చర్చించినట్టు మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి పొంగులేటి సమాధానం చెప్పారు. పైలెట్ ప్రాజెక్టు కింద నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలాన్ని ఎంపిక చేసినట్టు మంత్రి వివరించారు
క్యాబినెట్ నిర్ణయాలు
- ఇచ్చిన మాట ప్రకారం ఏటా నిర్ధిష్ట కాల వ్యవధిలో జాబ్ క్యాలెండర్ ప్రకటన. శుక్రవారం జాబ్ క్యాలెండర్‌పై అసెంబ్లీలో చర్చ.
- కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు వేర్వేరుగా జారీ. విధి విధానాల ఖరారుకు మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం.
- జీహెచ్‌ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్‌బాబుతో సబ్‌కమిటీ నియామకం.
- క్రీడాకారులు ఈషాసింగ్, నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్‌లో 600 గజాల ఇంటి స్థలం పంపిణీ.
- నిఖత్ జరీన్, సిరాజ్‌కు గ్రూప్ ఉద్యోగాలు.
- విధి నిర్వహణలో మరణించిన డీజీ రాజీవ్ రతన్ కుమారుడు హరిరతన్‌కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం.
- మరో అధికారి అడిషనల్ డీజీ పీ మురళి కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం.
- గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలో అసంపూర్తిగా నిలిచిపోయిన కుడి, ఎడమ కాల్వల పూర్తికి ఆమోదం. దాదాపు 2 వేల ఎకరాల భూసేకరణకు నిధులతో సవరణ అంచనాల రూపొందించాలని నిర్ణయం.
- ఇటీవల గవర్నర్ ప్రభుత్వానికి తిరిగి పంపించిన గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీల భర్తీకి ప్రొఫెసర్ కోదండరాం, అమీర్‌అలీఖాన్ పేర్ల ప్రతిపాదన.
- నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరణకు నిర్ణయం. రెండో విడతగా చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని, అవసరమైతే ఇథనాల్, విద్యుదుత్పత్తికి అక్కడి ఫ్యాక్టరీల్లో ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘానికి బాధ్యతలు అప్పగింత.
- మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీటిని శామీర్‌పేట చెరువులో నింపి, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం. మొత్తం 15 టీఎంసీలు తరలించి, అందులో 10 టీఎంసీలు సాగునీటికి కోసం చెరువులు నింపాలని, మిగతా 5 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించాలి.
- కేరళలోని వయనాడ్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి మరణించిన వారికి క్యాబినెట్ సంతాపం. ప్రభుత్వం తరపున అవసరమైన సహాయక చర్యలను అందించాలని నిర్ణయం.