25-03-2025 04:16:58 PM
అందోల్: సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం సుల్తాన్ పూర్ జేఎన్టీయూలో విద్యార్థుల ఆందోళన చేశారు. దీంతో అక్కడ అలజడి వాతావరణం నెలకొంది. సోమవారం రాత్రి క్యాంపస్ లో నాణ్యతలేని భోజనం వడ్డిస్తున్నారంటూ జేఎన్టీయూ కళాశాల గేటు ముందు బైఠాయించి విద్యార్థుల ధర్నా నిర్వహించారు. జేఎన్టీయూ ప్రిన్సిపాల్ కు భోజనం సరిగా లేదంటూ పలుమార్లు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంపస్ కు చేరుకొని విద్యార్థుల ధర్నాను పోలీసులు విరమింప చేశారు.