calender_icon.png 24 November, 2024 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జార్ఖండ్‌లో జేఎంఎం ఘన విజయం

24-11-2024 02:26:02 AM

  1. ఎగ్జిట్ పోల్స్‌ను తలకిందులు చేస్తూ 56 స్థానాల్లో గెలుపు
  2. 24 స్థానాలకే పరిమితమైన ఎన్డీయే కూటమి

రాంచీ, నవంబర్ 23 : జార్ఖండ్‌లో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చ (జేఎంఎం) కూటమి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. రాష్ట్రంలోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగ్గా జేఎంఎం కూటమి మ్యాజిక్ ఫిగర్ 41ని దాటి ఏకంగా 5౬ స్థానాల్లో విజయం సాధించింది.

ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా వంటి ప్రముఖులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేసినప్పటికీ ఎన్డీయే కూటమి కేవలం 2౪ స్థానాలకే పరిమితం అయింది. మిగిలిన ఒకస్థానంలో ఇతరులు గెలుపొందారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ జార్ఖండ్‌లో ఎన్డీయే కూటమిదే అధికారమని తేల్చి చెప్పాయి.

అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్నికల్లో జేఎంఎం కూటమి జయకేతనం ఎగరవేసింది. ఉదయం కౌటింగ్ ప్రారంభమైన తర్వాత కొద్ది సమయం వరకూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే ఆధిక్యంలో కొనసాగినప్పటికీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయి జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి ఆధిక్యంలోకి వచ్చింది. తర్వాత ఎక్కడా కూడా ఇండియా కూటమి తడబడలేదు.