calender_icon.png 23 November, 2024 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జార్ఖండ్‌ మళ్లీ ఇండియా కూటమిదే

23-11-2024 12:36:11 PM

రాంచీ: జార్ఖండ్ మళ్లీ ఇండియా కూటమిదే. మనీలాండరింగ్ కేసులో ఈ ఏడాది ప్రారంభంలో ఈడీ అరెస్టు అయిన  జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అసెంబ్లీ ఎన్నికలలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేతృత్వంలోని కూటమికి అద్భుతమైన విజయాన్ని అందించారు. ఎగ్జిట్ పోల్ అంచనాలను ధిక్కరిస్తూ, జేఎంఎం మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మార్గంలో దూసుకుపోతుంది. కూటమి దాదాపు 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో జార్ఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇండియా కూటమి సన్నహాలు చేస్తోంది. మరోసారి ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. జార్ఖండ్‌ ఇండియా కూటమి గెలుపుతో కాంగ్రెస్‌ కీలక సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జార్ఖండ్‌లోని అన్ని కీలక ప్రాంతాలైన చోటా నాగ్‌పూర్, కోల్హాన్, కోయ్‌లాంచల్‌లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉన్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్-రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) కూటమి 47 సీట్లు గెలుచుకుంది. జేఎంఎం సొంతంగా 30 సీట్లు గెలుచుకుంది. 2014లో 19 సీట్లు వచ్చాయి. బీజేపీ 81 సీట్లలో 25 మాత్రమే గెలుచుకోగలిగింది. ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాతో సహా బిజెపి సోరెన్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.