calender_icon.png 26 February, 2025 | 6:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంభమేళాకు వెళ్లొస్తుండగా ప్రమాదం: ఎంపీకి తీవ్ర గాయాలు

26-02-2025 01:30:05 PM

న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీ, జార్ఖండ్ ముక్తి మోర్చా (Jharkhand Mukti Morcha) నాయకురాలు మహువా మాజీ(Mahua Maji Accident), ఆమె కుమారుడు సోమ్విత్ మాజీ, కోడలు కృతి శ్రీవాస్తవ మాజీ, డ్రైవర్ భూపేంద్ర బాస్కీ బుధవారం మహా కుంభ్(Maha Kumbh Mela 2025) నుండి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మహువా మాజీ, ఆమె కుటుంబం మహా కుంభ పవిత్ర స్నానం కోసం ప్రయాగ్‌రాజ్‌(Prayag Kumbh Mela)కు యాత్ర ముగించుకుని రాంచీకి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జార్ఖండ్‌లోని లతేహర్ సదర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారందరినీ వెంటనే చికిత్స కోసం రాంచీలోని ఆర్చిడ్ ఆసుపత్రికి తరలించారు. బాధితులందరి పరిస్థితి స్థిరంగా ఉందని వారు ప్రమాదం నుండి బయటపడ్డారని వైద్యులు వెల్లడించారు. 

బుధవారం తెల్లవారుజామున 3:45 గంటల ప్రాంతంలో వాహనం నడుపుతున్న మహువా మాజీ కుమారుడు సోమ్విత్ మాజీ నిద్రమత్తులో కారు నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. లాతేహార్‌లోని జాతీయ రహదారి 75లోని హాట్‌వాగ్ సమీపంలో ఆగి ఉన్న ట్రక్కును వాహనం ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో మహువా మాజీ డ్రైవర్ సీటు వెనుక కూర్చుని ఉంది. మహువా మాజీ ఎడమ మణికట్టు విరిగిపోయి, ఛాతీ ఎముకలో స్వల్ప పగులు ఏర్పడిందని వైద్యులు సూచించారు. ఆమె కుమారుడు సోమ్విత్ మాజీకి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. అతనికి చికిత్స అందించబడింది. ప్రాథమిక వైద్య సహాయం పొందిన తర్వాత అతను బాగా కోలుకుంటున్నట్లు సమాచారం. ప్రమాదం వార్త అందిన వెంటనే, లతేహార్ జిల్లా పోలీసులు(Latehar District Police) సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను లతేహార్ సదర్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత, వారిని తదుపరి వైద్య సహాయం కోసం రాంచీకి తరలించారు. ఈ ప్రమాద సంఘటన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(Jharkhand CM Hemant Soren) స్పందించారు. మహువా మాజీ, ఆమె కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.